Breaking News

బాణసంచా ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

Published on Wed, 10/15/2025 - 05:25

సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికులు చనిపోయేంతగా పెద్ద ఘటన జరగడానికి కారణాలను ప్రశ్నించింది. రెండు వారాల్లో వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. 

ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ‘కోనసీమ జిల్లాలోని కొమరిపాలెం గ్రామంలో బాణసంచా తయారీ యూనిట్‌లో ఈ నెల 8న జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరిస్తున్నాం. ఈ ఘటనలో తయారీ యూనిట్‌ యజమాని కూడా మరణించినట్లు మా దృష్టికి వచ్చింది. మీడియా నివేదికలోని విషయాలు నిజమైతే, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. 

అందువల్ల ఈవిషయంపై రెండు వారాల్లో వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేశాం. బాధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా లేదా కూడా నివేదికలో తెలుపుతారని ఆశిస్తున్నాం. పేలుడు జరిగిన సమయంలో 12 మంది కార్మికులు యూనిట్‌ లోపల ఉన్నారు. పేలుడు పదార్థాల మిశ్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు’ అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)