గేమ్‌చేంజర్ జీఎస్‌టీ సంస్కరణలు!!

Published on Sun, 08/17/2025 - 04:29

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల్లో ప్రతిపాదిత మార్పులను ‘కొత్త తరం’గేమ్‌ చేంజర్‌ సంస్కరణలుగా సీనియర్‌ ప్రభుత్వాధికారులు అభివర్ణించారు. ఇవి అంతిమంగా 2047 నాటికి ఒకే శ్లాబ్‌ దిశగా బాటలు వేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సాధారణంగా ఆదాయ, వ్యయాల సామర్థ్యాలు దాదాపు ఒకే స్థాయిలో ఉండే సంపన్న దేశాలకు సింగిల్‌ రేటు విధానం అనువుగా ఉంటుంది. అలా మన దగ్గర కూడా ఒకే శ్లాబ్‌ విధానాన్ని తేవడమే అంతిమ లక్ష్యం. అయితే, ప్రస్తుతం అందుకు సమయం అనువుగా లేదు.

భారత్‌ కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారిన తర్వాత దానిపై దృష్టి పెట్టొచ్చు’అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్న నాలుగు శ్లాబులను 5 శాతం, 18 శాతం కింద రెండు శ్లాబులుగా, డీమెరిట్‌ గూడ్స్‌పై 40 శాతంగా సవరించాలని కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రెండు శ్లాబుల విధానాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆమోదిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత దన్ను లభిస్తుందని, అమెరికా టారిఫ్‌ ముప్పులను కూడా కొంత వరకు అధిగమించవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు తొలుత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ప్యానెల్‌కి, ఆ తర్వాత జీఎస్‌టీ కౌన్సిల్‌ ముందుకు వెళ్తాయి. పన్ను సంస్కరణలపై జీఎస్‌టీ కౌన్సిల్‌ సెప్టెంబర్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

ధరలు తగ్గుతాయి.. వినియోగం పెరుగుతుంది..
కొత్త విధానంతో చాలా నిత్యావసర వస్తువులు తక్కువ శ్లాబులోకి మారడం వల్ల వాటి ధరలు తగ్గుతాయని, వినియోగం పెరుగుతుందని ఒక అధికారి వివరించారు. ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ), మధ్య తరగతి, పేదలు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నెక్ట్స్‌జెన్‌ జీఎస్‌టీని సిఫారసు చేశాం. అలాగే రోజువారీ వినియో గించే ఉత్పత్తుల ధరలు కూడా తగ్గేలా ప్రతిపాదనలు చేశాం’ అని తెలిపారు. పన్నులు తగ్గడం వల్ల ప్రజల చేతిలో మరింత డబ్బు మి గులుతుందని, ఇది అంతిమంగా వినియోగం మరింత పెరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

పన్ను రేట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కేంద్రం స్వల్పకాలికం కన్నా దీర్ఘకాలిక పరిష్కార మార్గం వైపే మొగ్గు చూపిందని చెప్పారు. ‘మేం ఒక్కొక్క ఉత్పత్తిని నిశితంగా పరిశీలించాం. రైతులు ఉపయోగించే పురు గు మందులు కావచ్చు, విద్యార్థుల పెన్సిళ్లు లేదా ఎంఎస్‌ఎంఈలకు అవసరమయ్యే ముడి వస్తువులు కావచ్చు.. ప్రతిదానిపై కూలంకషంగా చర్చించాం. మెరిట్, స్టాండర్డ్‌ శ్లాబుల కింద వర్గీకరించాం’ అని ఆ అధికారి చెప్పారు.

తాజా ప్రతిపాద నల ప్రకారం 12% కేటగిరీలో ఉన్న వెన్న, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్‌ మొదలైన 99% ఉత్పత్తులు 5% శ్లాబ్‌లోకి మారనున్నాయి. 28% శ్లాబ్‌లోని ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు లాంటి ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, అలాగే సిమెంట్‌ లాంటి ఉత్పత్తులు 18% శ్లాబ్‌లోకి వస్తాయి. ప్రస్తుతం 12% శ్లాబ్‌ పరిధిలో ఉన్న ప్యాకేజ్డ్‌ ఫుడ్, దుస్తులు మొదలైన 20% ఉత్పత్తులను 5% శ్లాబ్‌లోకి మార్చడం వల్ల ఆదాయం తగ్గినా, వినియోగం పెరగడం వల్ల ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.

#

Tags : 1

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)