Breaking News

మట్టిదిబ్బలో చీమలు పట్టిన లేలేత చేయి.. కంటతడి పెట్టించే గొర్రెల కాపరి కథనం

Published on Mon, 09/15/2025 - 11:23

బరేలీ: అది యూపీలోని బరేలీ పరిధిలోగల షాజహాన్‌ పూర్‌.. బహగుల్ నది వంతెన సమీపం నుంచి పశువుల కాపరి డబ్లూ తన మేకలను మేపుతూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అక్కడి ఒక మట్టి దిబ్బ నుండి శిశువు ఆర్తనాదాలు అతనికి వినిపించాయి. దగ్గరకు వెళ్లి చూసిన డబ్లూ కంగుతిన్నాడు. మట్టిదిబ్బలో నుంచి చీమలు పట్టిన ఒక లేలేత చేయి బయటకు రావడాన్ని గమనించాడు.

ఆ లేలేల చేయి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతోంది. వందలాది చీమలు ఆ చేతిని పీక్కుతింటున్నాయి. ఒక్క చేయి తప్ప మిగిలిన శరీర భాగమంతా  భూమిలో కప్పబడి ఉంది.. డబ్లూ మాటల్లో..‘నేను చూస్తున్నది నమ్మలేకపోయాను. వెంటనే పెద్దగా కేకలు వేశాను.  పోలీసులకు సమాచారం ఇచ్చేలోగానే  అక్కడున్నవారందరినీ పిలిచాను. వారు సంఘటనా స్థలంలో గుమిగూడారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన పోలీసు బృందం మట్టి దిబ్బ నుంచి శిశువును జాగ్రత్తగా బయటకు బయటకు తీసింది. రోజుల శిశువు శరీరం బురదతో ముద్దయిపోయివుంది. శిశువు అత్యంత దుర్బర స్థితిలో ఉంది. శిశువును వెంటనే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ  అత్యవసర చికిత్స అందించారు. వైద్యులు శిశివు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశాక, ప్రభుత్వ వైద్య కళాశాలకు రిఫర్ చేశారు’ అని తెలిపాడు.

ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ‘శిశువు వయసు దాదాపు 15 రోజులుంటుంది. చాలా బలహీనంగా ఉంది. ఆ శిశువును తీసుకువచ్చే సమయానికే తీవ్ర గాయాలున్నాయి. శిశువు చేతిని చీమలు తీవ్రంగా కుట్టాయి. విపరీతంగా రక్తస్రావం అయ్యింది. శశువు ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంది, పరిస్థితి విషమంగా ఉంది’ అని అన్నారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ‘ఆ చిన్నారిని ఒక అడుగు లోతులో పాతిపెట్టారు.  శిశువు శ్వాస తీసుకునేందుకు వీలుగా ఉద్దేశపూర్వకంగా గాలి ఆడేందుకు చిన్న ఖాళీ స్థలం ఉంచారు. ఈ ఘటనకు కారకులైనవారిని గుర్తించేందుకు బాహుల్ నది రోడ్డు వెంబడి  ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. జైతిపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గౌరవ్ త్యాగి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)