Breaking News

దేశాన్ని బట్టి నిద్ర!

Published on Sun, 06/15/2025 - 01:40

ఆరోగ్యవంతులు చక్కగా నిద్రపోతారు. చక్కగా నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు? మంచి ఆరోగ్యానికి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని ఏళ్లుగా డాక్టర్లు చెబుతూ వస్తున్నదే. అయితే అలాంటి పట్టింపు అవసరం లేదని, జీవన శైలిని బట్టి కాస్త తక్కువగానో ఎక్కువగానో నిద్రించవచ్చని కెనడాలోని విక్టోరియా, బ్రిటన్‌లోని కొలంబియా విశ్వ విద్యాలయాల పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో వెల్లడించారు. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

10 గంటల నిద్ర అనారోగ్యమే!
ప్రతి దేశంలోనూ సంస్కృతికి అనుగుణం కాని నిద్ర గంటల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని కూడా క్రిస్టీన్‌ బృందం తమ అధ్యయనంలో కనుగొంది. అంటే చాలా తక్కువ నిద్రపోవడం లేదా చాలా ఎక్కువ నిద్రపోవడం అని కాకుండా, వారి సంస్కృతిని అనుసరించి నిద్ర పోవటం అన్నదే వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది. బ్రిటన్‌ పౌరులు కొందరు 10 గంటల 26 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోయిన కారణంగా.. అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నారని క్రిస్టీన్‌ బృందం పేర్కొంది. 

అమెరికాలో 8 గంటల 13 నిమిషాలు నిద్రపోయే వారిలో కూడా ఈ సమస్య కనిపించింది. క్రిస్టీన్‌ బృందం తమ అధ్యయనంలో పోషకాహారం, సంపద, అసమానత, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలను చేర్చలేదు. కాబట్టి నిద్ర గంటలకు, ఆరోగ్యంపై నిద్ర చూపే ప్రత్యక్ష ప్రభావంపై తీర్మానాలేవీ  చేయలేకపోయారు. ‘ఎవరైనా ఎన్ని గంటలు నిద్రపోవాలన్న ప్రశ్నకు సమాధానం నిజంగా చాలా సంక్లిష్టమైనది. 

మనిషికి రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం అనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవు. మీ నిద్ర, ఆరోగ్యం విషయంలో మీ సంస్కృతిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కీలే విశ్వవిద్యాలయంలోని స్లీప్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ దల్జిందర్‌ చామర్స్‌ సూచించారు.

దేశానికొక ‘తగినంత నిద్ర’
నిద్ర కేవలం దేహధర్మం మాత్రమే కాదని, ఆ దేశ అలవాట్లు, సంస్కృతి, పని వేళలు, అక్కడి వాతావరణం, సూర్యరశ్మి తగిలేలా ఉండటం, సామాజిక నిబంధనల వంటి అనేక కారకాలు నిద్ర పోయే సమయాన్ని ప్రభావితం చేస్తాయని ‘విక్టోరియా స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌’లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా ఉన్న డాక్టర్‌ క్రిస్టీన్‌ చెబుతున్నారు. ‘‘ఒక దేశంలో ‘తగినంత’ నిద్రగా పరిగణన పొందేది, మరొక దేశంలో అతి నిద్ర కావచ్చు, లేదా చాలినంత నిద్ర కాకనూ పోవచ్చు’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న క్రిస్టీన్‌ అంటున్నారు. 

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా తదితర 20 దేశాలలో ఈ అధ్యయనం కోసం ఆన్లైన్‌ ప్రశ్నపత్రాన్ని పూర్తి చేసిన దాదాపు 5,000 మంది వ్యక్తుల నిద్ర అలవాట్లు, ఆరోగ్య డేటాను విశ్లేషించి క్రిస్టీన్‌ బృందం ఈ ముగింపునకు వచ్చింది. నిద్రా సమయంపై గతంలోనూ అనేక సుప్రసిద్ధ సంస్థలు ఎన్నో అధ్యయనాలు చేశాయి. 

అలా జరిగిన 14 అధ్యయనాల నుండి అదనపు సమాచారాన్ని కూడా ప్రస్తుతం బృందం సేకరించింది. అంతేకాకుండా ఆయుర్దాయం, గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి వాటికీ, నిద్రపోయే గంటలకు మధ్య ఉన్న సంబంధాన్ని లెక్కలోకి తీసుకుని పరిశోధకులు ఈ ఫలితాలను వెల్లడించారు. 

ఫ్రాన్స్‌లో ఎక్కువ... జపాన్‌లో తక్కువ
తాజా అధ్యయనం ప్రకారం.. భారతీయులు సగటున 7 గంటల 15 నిమిషాలు నిద్రపోతున్నారు. ఈ విషయంలో ప్రపంచ సగటు కూడా మన నిద్రా సమయంతో సమానంగా ఉండటం విశేషం. ఫ్రాన్స్‌ జాతీయులు తక్కిన దేశస్థుల కన్నా ఎక్కువ సమయం నిద్రిస్తున్నారు. ప్రశ్నపత్రం పూరించిన ముందు రోజు రాత్రి సగటున వారు 7.52 గంటలు నిద్రించారు. ఇక అందరికన్నా తక్కువగా నిద్రపోయిన వారు జపనీయులు. వారు 6.18 గంటలు మాత్రమే నిద్రపోయారు. బ్రిటన్‌ వాళ్లు 7 గంటల 33 నిమిషాలు నిద్రపోతే, అమెరికాలో నిద్రా సమయం 7 గంటల 2 నిమిషాలే. 

క్రిస్టీన్‌ బృందం మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కూడా కనుగొంది. ఆరోగ్యకారకమైన ‘ఆదర్శ’ నిద్రా సమయం అంటూ ఏ దేశంలోనూ లేదు! తక్కువ సగటు నిద్ర వ్యవధి ఉన్న దేశాల వారిని ఎక్కువసేపు నిద్రపోయే దేశాలలోని వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు వాళ్ల ఆరోగ్యం అధ్వానంగా ఉందని చెప్పటానికి ఈ బృందానికేమీ ఆధారాలు కనిపించలేదు. దేశ సంస్కృతికి అనుగుణమైన నిద్ర గంటలు.. ఆదర్శ నిద్ర గంటల కంటే ఆరోగ్యంగా ఉంచుతున్నాయని అధ్యయనం పేర్కొంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)