Breaking News

పగటిపూట 20% తక్కువ.. రాత్రిపూట 20% ఎక్కువ

Published on Sat, 06/24/2023 - 06:12

న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్త విద్యుత్‌ టారిఫ్‌ అమల్లోకి రానుంది. పగటిపూట వినియోగం తక్కువగా ఉండే సమయంలో విద్యుత్‌ వాడుకుంటే చార్జీలు 20 శాతం వరకు తగ్గుతాయి. రాత్రిపూట వినియోగం అధికంగా ఉండే సమయంలో విద్యుత్‌ ఉపయోగించుకుంటే చార్జీలను 20 శాతం మేర పెంచుతారు. ఈ మేరకు టైమ్‌ ఆఫ్‌ ద డే(టీఓడీ) టారిఫ్‌ పేరిట కొత్త విద్యుత్‌ నియమాలను కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.

దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త టారిఫ్‌ను అమలు చేయడం వల్ల పీక్‌ సమయాల్లో గ్రిడ్‌పై భారంతోపాటు విద్యుత్‌ డిమాండ్‌ తగ్గుతుందని తెలియజేసింది. ఈ నూతన విధానం 2024 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మొదట వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

సంవత్సరం తర్వాత.. అంటే 2025 ఏప్రిల్‌ 1 నుంచి వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని రంగాల విద్యుత్‌ వినియోగదారులకు ఈ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నూతన టారిఫ్‌ విధానంతో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ అభిప్రాయపడ్డారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగం రాత్రిపూటే ఎక్కువ కాబట్టి వినియోగదారులపై భారం పడుతుందని విద్యుత్‌ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)