Breaking News

Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు

Published on Tue, 02/18/2025 - 07:12

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫిబ్రవరి 15న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. అదేవిధంగా దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు మూడు నూతన విధానాలను అనుసరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

ఇవే ఆ మూడు విధానాలు

1. హోల్డింగ్‌ ఏరియాను ఏర్పాటు
రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 60 ప్రధాన రైల్వేస్టేషన్లలో హోల్డింగ్‌ ఏరియాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాల్లో రైలు ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు వచ్చే వరకూ వేచివుండాల్సివుంటుంది. రైలు వచ్చిన తరువాతనే ప్రయాణికులంతా క్రమపద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఈ వ్యవస్థను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌, ఆనంద్‌ విహార్‌ స్టేషన్‌, లక్నో, వారణాసి, మొగల్‌సరాయ్‌, కాన్పూర్‌, ఝాన్సీ, పట్నా, ముంబై, సూరత్‌, బెంగళూరు, హౌరా తదితర స్టేషన్లలో  ఏర్పాటు చేయనున్నారు.

2. ప్రయాణికులకు అవగాహన
రైల్వేస్టేషన్లలో ముందుజాగ్రత్త చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులెవరూ మెట్లపై కూర్చోకూడదని విజ్ఞపి చేయనున్నారు. పలువురు ప్రయాణికులు మెట్లపై కూర్చోవడం వలన ఆ మెట్లపై ఎక్కేవారికి, దిగేవారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన దరిమిలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

3 సూచనలు, సలహాల స్వీకరణ
వివిధ రైల్వేస్టేషన్లలో రైల్వే అధికారులు ఆరు నెలలపాటు ప్రత్యేక అవగాహనా ప్రచారాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు, ప్లాట్‌ఫారాల వద్ద పనిచేసే సిబ్బంది, స్టాల్స్‌ నిర్వహిస్తున్న దుకాణదారులకు రైల్వే అధికారులు పలు సూచనలు చేయనున్నారు. అలాగే వారి నుంచి రద్దీ నియంత్రణకు అవసరమైన సలహాలను కూడా స్వీకరించనున్నారు.  

ఇది కూడా చదవండి: ‘అద్దాలు పగులగొడితే.. ఈడ్చుకెళ్లాల్సిందే’

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు