Breaking News

నాడు చైనా నుంచి తప్పించుకున్న దలైలామా ఏం చేశారు?

Published on Mon, 07/06/2026 - 13:16

ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్న 14వ దలైలామా జీవిత విశేషాలు, భారత్‌తో ఆయనకున్న అనుబంధంపై ‘ఎటర్నల్ లైట్: ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ హిస్ హోలీనెస్ ది ఫోర్టీన్త్ దలైలామా’ అనే కొత్త పుస్తకం విడుదలైంది. టిబెట్‌లో చైనా నియంత్రణ పెరగడంతో, దలైలామా 1959లో లహాసా నుండి తప్పించుకుని భారత సరిహద్దుకు చేరుకున్నారు. ఆ సమయంలో భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, ముస్సోరీలో ఆయనను కలుసుకుని టిబెట్ శరణార్థుల పునరావాసం, వారి పిల్లల విద్య కోసం పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన సహాయాన్ని అందించారు.

ఈ నిర్ణయం చైనాతో దౌత్యపరమైన సవాళ్లను తెచ్చిపెట్టినప్పటికీ, భారత్‌లో టిబెట్ ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు పునాది వేసింది. ఈ బయోగ్రఫీలో నెహ్రూ కుమార్తెగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఇందిరా గాంధీకి దలైలామాతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రస్తావించించారు. టిబెట్ సంక్షోభాన్ని నెహ్రూ కాలం నుండి దగ్గరగా చూసిన ఇందిరా గాంధీ, ఈ సమస్యను కేవలం ఒక సాధారణ దౌత్య విషయంగా కాకుండా నైతిక, వ్యూహాత్మక బాధ్యతగా భావించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో చైనాతో ఉన్న క్లిష్టమైన సంబంధాలను సమతుల్యం చేస్తూనే, టిబెట్ ప్రజల విషయంలో మానవతా దృక్పథాన్ని కొనసాగించారు.

ఇందిర హయాంలోనే ధర్మశాల టిబెట్ శరణార్థుల జీవన కేంద్రంగా రూపాంతరం చెందింది. దయ, దౌత్యం, శరణార్థుల పునరావాసాల కలయికతో ఆమె దలైలామాతో సంబంధాలను కొనసాగించారు. ఆ తర్వాత 1980ల నాటికి రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యే సమయానికి, దలైలామా ఉనికి భారతదేశ నైతిక, దౌత్యపరమైన ముఖచిత్రంలో ఒక భాగంగా మారిపోయింది. భారత్ తన టిబెట్ విధానంలో సంయమనాన్ని ప్రదర్శించింది. ఈ పుస్తకంలో భారత్‌లో దలైలామా జీవితాన్ని కేవలం శరణార్థిగా కాకుండా రాజకీయాలు, జ్ఞాపకాలు, కరుణ, వ్యూహాత్మక సంయమనంతో కూడిన సుదీర్ఘ ప్రయాణంగా అభివర్ణించింది. కష్టకాలంలో తలుపులు తెరిచి ఆశ్రయమిచ్చిన ఒక దేశం, కఠిన నిర్ణయాలు తీసుకున్న నేతలు, వారి వెనుక నిర్మితమైన ఒక సమాజానికి ఈ పుస్తకం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)