Breaking News

రాయల్‌ వెడ్డింగ్‌ : గర్ల్‌ఫ్రెండ్‌తో జూ. ట్రంప్‌ స్టెప్పులు

Published on Sat, 11/22/2025 - 15:45

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో రాయల్‌ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓర్లాండోకు చెందిన బిలియనీర్ పద్మజ, రామరాజు మంతెన దంపతుల కుమార్తె  నేత్ర మంతెన, మరో వ్యాపారవేత్త సూపర్‌ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు, CTO వంశీ గదిరాజు ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూ.డొనాల్డ్ ట్రంప్ (Donald Trump Jr.), ఆయన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్ ఉత్సాహంగా స్టెప్పులు వేయడం విశేషంగా నిలిచింది. దీనికి   సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఉదయపూర్‌లో జరుగుతున్న వివాహ వేడుకల్లో భాగంగా జూ. ట్రంప్ బాలీవుడ్‌ బీట్‌లకు డ్యాన్స్‌చేశారు. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్ తన హిట్ పాట "వాట్ ఝుమ్కా?" సాంగ్‌కు వీళ్లద్దిరనీ ఆహ్వానించి మరీ స్టెప్పులు వేయించడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

 

అటు వధూవరులు నేత్ర, వంశీ కూడా రణ్‌వీర్‌తో కలిసి డ్యాన్స్‌ చేశారు. 

లేక్స్‌ సిటీలో నేత్ర మంతెన, వంశీ పెళ్లి సందడిలో భాగంగా శుక్రవారం (నవంబర్ 21) సంగీత్‌ వేడుక జరిగింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ సంగీత్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, కృతి సనన్, వరుణ్ ధావన్‌లతో సహా బాలీవుడ్‌ తారలు సందడి చేశారు. "ఆంఖ్ మారే", గల్లీ బాయ్ "అప్నా టైమ్ ఆయేగా" పాటలతో వేదికపై ఉన్న ప్రతి ఒక్కరినీ స్టెప్పులేయించి, అతిథులందరినీ అలరించారు. బెట్టినా ఆండర్సన్ బంగారు లెహంగా-చోలిలో అద్భుతంగా కనిపించగా, రణ్‌వీర్ నల్లటి ఫార్మల్ సూట్‌లో మెరిశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wizcraft Weddings & Social Events (@wizcraft.weddings) నేత్ర మంతెన, వంశీ గదిరాజు వెడ్డిండ్‌ వేడుకలు  లీలా ప్యాలెస్, జెనానా మహల్ , జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌తో సహా అనేక ఐకానిక్ వేదికలలో మూడు రోజుల పాటు  జరుగుతాయి. సుమారు 600 మంది అతిథులు పాల్గొంటారు.భారతీయ కళాకారులతో పాటు, ఈ వివాహంలో అంతర్జాతీయ పాప్ తారలు జెన్నిఫర్ లోపెజ్ మరియు జస్టిన్ బీబర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి. నవంబర్ 23న సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్‌తో  ఈ సందడి ముగియనుంది. 
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)