Breaking News

నీట్‌ యూజీ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం

Published on Thu, 01/16/2025 - 19:58

ఢిల్లీ: నీట్‌ యూజీ పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఎంఆర్‌ పద్దతిలో నీట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. కేంద్ర విద్య-ఆరోగ్య శాఖల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం చివరకు ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. ‘‘నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్ణయం మేరకు  నీట్‌ యూజీ పరీక్ష పెన్‌, పేపర్‌ పద్ధతిలో నిర్వహిస్తామని ఒకే రోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది.

2024లో 24 లక్షల మంది విద్యార్థులు నీట్‌ యూజీ పరీక్ష రాయగా, జేఈఈ మెయిన్‌ తరహాలోనే ఈసారి కూడా నీట్‌ యూజీ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావించింది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్‌ విధానంలోనే నీట్‌ నిర్వహించాలంటూ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత సర్వే, చర్చల్లో ఓఎంఆర్‌ పద్ధతికే మొగ్గుచూపడంతో ఈ నిర్ణయం అమలు చేయనున్నారు.

నీట్‌ ఫలితాల ఆధారంగానే నేషనల్‌ కమిషన్ ఫర్‌ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్‌ కోర్సు అడ్మిషన్లు చేపడతారు. దీంతో పాటుగా ఆర్మ్‌డ్‌ మెడికల్‌ సర్వీస్‌ హాస్పిటల్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు అడ్మిషన్లకు నీట్ యూజీ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు కూడా నీట్‌ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది.

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక

 

 

 

 

 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)