Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

Published on Sat, 10/25/2025 - 11:13

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పదునైన ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్ల పిరికిపంద చర్య బయటపడింది. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేల కాంకేర్‌లో మావోయిస్టులు ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను హత్యచేశారు. హతులను తిరుపతి సోధి, రవి కట్టంగా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు అక్టోబర్ 13న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత పూనెం సత్యంను దారుణంగా హత్య చేశారు. అతను ఇన్ఫార్మర్ అని వోమావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో పూనెం సత్యం మృతదేహం దగ్గర మావోయిస్టులు ఒక కరపత్రాన్ని ఉంచారు.

దానిలో వారు పలు ఆరోపణలు చేశారు. ఈ హత్యకు మద్దీద్ ఏరియా కమిటీ ఆఫ్ నక్సలైట్స్ బాధ్యత వహించింది.  కాగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో నిఘాను మరింత బలోపేతం చేస్తోంది. పోలీసు ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్‌ను పెంచుతోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా మావొయిస్టుల స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)