Breaking News

Drone Attacks: భారత నేవీ కీలక నిర్ణయం

Published on Tue, 12/26/2023 - 07:27

ముంబై: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్‌ దాడులు జరుగుతుండడంతో ఇండియన్‌ నేవి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సముద్రంలో గస్తీ కోసం మూడు ఐఎన్‌ఎస్‌ వార్‌షిప్పులను రంగంలోకి దింపింది. వీటితో పాటు తీరంలో పెట్రోలింగ్‌ విమానాలతో నిఘా ఉంచనుంది.

‘ఇటీవల వాణిజ్య నౌకలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని మూడు వార్‌షిప్పులను పశ్చిమ తీరంలో గస్తీ కోసం రంగంలోకి దింపాం. వీటికి మిసైళ్లను, డ్రోన్‌లను అడ్డుకుని నాశనం చేసే సామర్థ్యం ఉంది. ఇవి కాక లాంగ్‌ రేంజ్‌ పెట్రోలింగ్‌ విమానాలు తీరం వెంబడి నిఘా పెడతాయి. కోస్ట్‌గార్డ్‌లతో సమన్వయం చేసుకుని పరిస్థితిని నిషితంగా పరిశీలిస్తున్నాం’ అని నేవీ వెస్టర్న్‌ కమాండ్‌ అధికారి ఒకరు తెలిపారు. 

సౌదీ అరేబియా నుంచి భారత్‌లోని మంగళూరు వస్తున్న క్రూడాయిల్‌ నౌక కెమ్‌ ఫ్లూటోపై పోర్‌బందర్‌ తీరానికి 400 నాటికల్‌ మైళ్ల దూరంలో ఇటీవలే డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్‌ ఇరాన్‌ నుంచి వచ్చిందని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్‌ ప్రటించడం సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత ఎర్ర సముద్రంలో మరో క్రూడాయిల్‌ నౌకపైనా డ్రోన్‌ దాడి జరిగింది. మరోవైపు దాడి తర్వాత ముంబై డాక్‌యార్డుకు చేరుకున్న కెమ్‌ ఫ్లూటోను ఫోరెన్సిక్‌ అధికారులు తనిఖీ చేశారు.  

ఇదీచదవండి..ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’

  

  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)