Breaking News

కమిషనర్‌ రాకపోతే.. డీజీపీని రప్పిస్తాం

Published on Thu, 07/10/2025 - 04:02

సాక్షి, న్యూఢిల్లీ: ‘విచారణకు పోలీసు కమిషనర్‌ కదా హాజరు కావాల్సింది? ఏసీపీ గారూ మీరెందుకు వచ్చారు? అధికారులకు ఈమాత్రం తెలియదా?’అని సైబరాబాద్‌ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. 15 రోజుల్లో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే తదుపరి విచారణ తేదీకి రాష్ట్ర డీజీపీని రప్పిస్తామని హెచ్చరించింది. సినీ నటుడు విజయ్‌ దేవరకొండ గిరిజనులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విచారణ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌ నాయక్‌ ఈ హెచ్చరిక చేశారు. 

ఏప్రిల్‌ 26న రెట్రో సినిమా వేడుకలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. భారత్, పాక్‌ మధ్య సమస్యను ప్రస్తావించే క్రమంలో గిరిజనులను కించపర్చే అర్థం వచ్చేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై గిరిజన సంఘం నాయకుడు అశోక్‌కుమార్‌ రాథోడ్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు విజయ్‌ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్‌ కుమార్‌ రాథోడ్‌ జాతీయ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయటంతో కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌ నాయక్‌ బుధవారం విచారణ చేపట్టారు. 

విచారణకు పోలీస్‌ కమిషనర్‌ కాకుండా మాదాపూర్‌ ఏసీపీ శ్రీధర్‌ హాజరు కావటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లక్షల మందిని ప్రభావితం చేసే ఒక నటుడు ఒక వర్గాన్ని కించపర్చేలా ఎలా మాట్లాడతారు? ఆయన వ్యాఖ్యలపై మీరు కేసు నమోదు చేశారు బాగానే ఉంది. ఈ రోజు (బుధవారం) విచారణకు పోలీసు కమిషనర్‌ హాజరు కావాలని మేం నోటీసులు ఇచ్చాం కదా? ఆయన కదా హాజరు కావాల్సింది? మీరెందుకు వచ్చారు?’అని నిలదీశారు. మరో 15 రోజుల్లో విచారణకు కమిషనర్‌ హాజరై హీరో విజయ్‌ దేవరకొండపై తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. ఆ రోజు కమిషనర్‌ రాకపోతే డీజీపీని రప్పిస్తామని హెచ్చరించారు.     

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు