సంవత్సరాంతంలో ఆకాశ దీపావళి?

Published on Sun, 12/28/2025 - 11:06

ఆకాశ దేశంలో వెలుగుల పండుగ. ధ్రువాల తరచూ కనువిందు చేసే వెలుగులు (అరోరా)లు ఈసారి మరీ అందంగా వెలుగొందాయి. కింద పెద్ద నగరాల తాలూకు విద్యుద్దీప కాంతులు, పైన అందరి గెలాక్సీ నుంచి పడ్డ వెలుగులు కలగలిసి అరోరాల అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. దాంతో అవి కాస్తా, ఇదుగో... ఇలా విస్మయం కలిగించేలా వింత శోభ సంతరించుకున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా సైంటిస్టు డాన్‌ పెటిట్‌ వాటిని ఇలా అద్భుతంగా కెమెరా కంటితో బంధించి పంపారు! 

అరోరాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ధ్రువకాంతులు. సూర్య కిరణాలతో సంయోగం చెందిన పై వాతావరణ పొరలోని అణువులు వాయు సంసర్గం పొందితే ఏర్పడే ఉంటా కాంతులు. ఆకుపచ్చ, ఊదాతో పాటు చిక్కని ఎరుపు రంగుల్లో మెరిసిపోవడం వీటి ప్రత్యేకత. సంవత్సరాంతంలో ఉత్తర ధ్రువం వద్ద ఆరోరాల సందడి కొత్తేమీ కాదు. కానీ అవి అంతరిక్ష వెలుగులతో కలగలిసి ఇలా కొత్త హొయలు పోవడమే చాలా అరుదు. 

శీతాకాలం అరోరాల్లో పెద్ద నగరాల తాలూకు దీప కాంతులు అరోరాలతో కలగలసి కనిపించడం అరుదు కాదు. కాకపోతే భూమికి ఏకంగా 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని ఆ్రన్డోమెడ గెలాక్సీ తాలూకు శోభ కూడా పెటిట్‌ ఫోటోల్లో నేపథ్యంలో కనిపిస్తోంది. ఈ విశేషం అందరి ఆకర్షిస్తోంది. పెటిట్‌ కూడా వీటిని ’బెస్ట్‌ హాలిడే లైట్స్‌’గా వరి్ణంచారు. సరిగ్గా క్రిస్మస్, న్యూ ఇయర్‌ నడుమ వెలుగు చూసిన ఈ ఇమేజీలు పండుగ వాతావరణానికి మరింత వన్నె తెచ్చాయి.       

#

Tags : 1

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)