Breaking News

జేకేలో అమరులైన కెప్టెన్‌, జవాన్లు వీరే

Published on Tue, 07/16/2024 - 13:16

జమ్ముకశ్మీర్‌లో మరోసారి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే  ఉదంతం చోటుచేసుకుంది. దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీకి చెందిన ఒక కెప్టెన్, నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దట్టమైన అడవుల మధ్య సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఉగ్రవాదులు సైనికులపై దాడికి తలపడగా నలుగురు వీర జవాన్లు అమరులయ్యారు. ఈ అమరుల పేర్లను సైన్యం విడుదల చేసింది. భారత ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందారు. థాపా రెండవ తరం ఆర్మీ అధికారి. అతని తండ్రి కల్నల్ భువనేష్ థాపా ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సోదరి నేపాలీ గాయని. థాపా సిలిగురిలో నివసిస్తున్నారు. ఆయన 2019లో భారత సైన్యంలో చేరారు. ఆయనతో పాటు జవాను నాయక్ డి రాజేష్, కానిస్టేబుళ్లు, బిజేంద్ర, అజయ్ అమరులైనవారిలో ఉన్నారు.

దోడాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అంతకంతకూ పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్‌తో మాట్లాడి తాజాగా జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు రక్షణ మంత్రి  పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)