Breaking News

సోలార్‌ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి!

Published on Sun, 12/17/2023 - 11:54

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 

సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడివారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు.

అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్‌ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. 
ఇది కూడా చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)