Breaking News

‘ఎమర్జెన్సీ’ ఎత్తేసిన రోజున..’.. జైశంకర్‌ యూపీఎస్‌సీ అనుభవాలు

Published on Mon, 07/21/2025 - 07:56

న్యూఢిల్లీ: ‘అది 1977, మార్చి 12.. దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తేసిన రోజు.. సరిగ్గా అదే రోజున నా యూపీఎస్‌సీ ఇంటర్బ్యూ జరిగింది’ అంటూ తన యూపీఎస్‌సీ జర్నీని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. నాడు తనకు జీవితంలో అగ్ని పరీక్ష ఎదురయ్యిందని న్యూఢిల్లీలో సంకల్ప్ ఫౌండేషన్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జైశంకర్‌ పేర్కొన్నారు. సివిల్ సర్వీసుల్లోకి ప్రవేశించిన కొత్త బ్యాచ్ సభ్యుల సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు.

విదేశాంగ మంత్రి జైశంకర్  తన యూపీఎస్‌సీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, దేశంలో అత్యవసర పరిస్థితి రద్దు చేసిన రోజున తనకు యూపీఎస్‌సీ ఇంటర్య్యూ జరిగిందని తెలిపారు. నాడు తనకు జీవితంలో నిజమైన సవాలు ఎదురయ్యిదని  అన్నారు.  నాడు ఎమర్జెన్సీని రద్దుచేయడంతో షాజహాన్ రోడ్‌లో జరిగే ఇంటర్వ్యూ కు హాజరయ్యాను. ఆ రోజు ఇంటర్వ్యూకు హాజరైన తొలి వ్యక్తిని తానేనని ఆయన తెలిపారు. తాను రాజకీయ శాస్త్రం విద్యార్థిని కావడంతో 1977 ఎన్నికల గురించి తనను అడిగారన్నారు.
 

దీనిసమాధానం ఇస్తున్న తరుణంలో తాను ఇంటర్వ్యూలో ఉన్నాననే సంగతిని మరచిపోయి పలు విషయాలు తెలియజేశానని జైశంకర్‌ తెలిపారు.  తాము 1977 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నామని, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పనిచేశామని చెబుతూ, విద్యార్థిగా తనకు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యూ)తో  ఉన్న అనుబంధాన్ని జైశంకర్‌ వివరించారు. కాగా విదేశాంగ కార్యదర్శిగా కూడా పనిచేసిన జైశంకర్.. ప్రభుత్వంతో ముడిపడిన పలు విషయాలను ప్రజలకు తెలియజేయడంలో ఎవరినీ నొప్పొంచకుండా వ్యవహరించడం చాలా కష్టమన్నారు.

మోదీ ప్రభుత్వం ఇటీవల అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు గడచిన తరుణాన్ని  గుర్తుచేసుకుంటుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1975, జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించారు. 1977 మార్చి 21న దానిని ఎత్తివేశారు.ఈ అత్యవసర పరిస్థితి తర్వాత జనతా పార్టీ 1977 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)