Breaking News

న్యూఇయర్‌ వేళ.. 18 వేల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. ఎక్కడంటే?

Published on Wed, 01/01/2025 - 19:34

ముంబై : న్యూఇయర్‌ వేడుకల్లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు భారీ మొత్తంలో నమోదైనట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా ముంబైలో ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది.  ఫలితంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో వాహనదారుల నుంచి రూ.89లక్షల ఫైన్‌ల రూపంలో వసూలు చేశారు.  

ముంబై పోలీసుల సమాచారం మేరకు..న్యూఇయర్‌లో మొత్తం 17,800 ఇ-చలాన్‌లను జారీ చేశారు. అందులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తులపై 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు, ప్రజా రవాణాకు అర్హతలేని వాహనాల్ని డ్రైవ్‌ చేసినందుకు 1,976 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు నగరంలో మితిమీరిన వేగానికి 842 చలాన్, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై 432 చలాన్లు వేసినట్లు పోలీసులు వెల్లడించారు.  

న్యూఇయర్‌ సందర్భంగా మద్యం తాగి డ్రైవ్‌ చేసిన వారికి 153 చలాన్‌లు, డ్రైవ్‌ చేస్తూ ఫోన్‌ మాట్లాడినందుకు 109 చలాన్‌లు, ట్రిపుల్‌ రైడింగ్ 123 చలాన్‌లను, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్‌ చేసినందుకు 40 చలాన్‌లు విధించారు. అలా మొత్తంగా విధించిన చలాన్లతో రూ.89,19,750 వసూలు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు.  

మీడియా కథనాల ప్రకారం 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్‌స్పెక్టర్‌లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు ముంబై వీధుల్లో విధులు నిర్వహించారు. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు