Breaking News

ఆస్కార్‌ రిటైరయ్యింది..!

Published on Fri, 10/25/2024 - 05:25

ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్‌’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్‌ హిల్‌ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్‌ ప్లేస్‌లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్‌ స్టిక్స్‌ను ఇది పసిగట్టింది. 

అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్‌ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్‌ వినీత్‌ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు.

 ముంబై పోలీసు విభాగం బాంబ్‌ డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌(బీడీడీఎస్‌)లో 2014లో చేరిన ఆస్కార్‌ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్‌ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ను ఏర్పాటు చేశామని చెప్పారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)