Breaking News

రైల్వేప్లాట్‌ఫాం పైనే మహిళకు పురుడు పోసిన యువకుడు 

Published on Fri, 10/17/2025 - 06:24

ముంబై: ఆ మధ్య వచ్చిన త్రీ ఇడియట్స్‌ సినిమాలో అత్యవసర సమయంలో ఓ డాక్టర్‌ వీడియోకాల్‌లో సూచనలు ఇస్తుండగా ఓ మహిళకు హీరో పురుడు పోసే సన్నివేశం ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజజీవితంలో ముంబైలో జరిగింది. గత మంగళవారం రాత్రి ముంబై లోకల్‌ రైళ్లో వికాస్‌ బిద్రే అనే వీడియో కెమెరామెన్‌ ప్రయాణిస్తుండగా అదే రైళ్లో 24 ఏళ్ల అంబికా ఝా పురుటి నొప్పులతో బాధపడటం గమనించాడు.

 చుట్టూ మరికొందరు ఉన్నా వికాస్‌ మెరుపులా స్పందించి అత్యవసర స్విచ్‌ నొక్కి రైలును రామ్‌మందిర్‌ స్టేషన్‌లో ఆపేశాడు. అప్పటికే అంబికాకు ప్రసవం కావటం ప్రారంభమైంది. శిశువు సగంవరకు బయటకు వచి్చంది. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న దుకాణాల వద్దకు పరుగెత్తి పరుపుల్లాంటివి పట్టుకొచ్చి ఆమెను పడుకోబెట్టారు. వికాస్‌ వెంటనే తన స్నేహితురాలైన దేవిక అనే డాక్టర్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. ఆమె వీడియోకాల్‌ చేసి సూచనలు ఇస్తుండగా అంబికకు వికాస్‌ డెలివరీ చేశాడు. అంతకుముందు ప్లాట్‌ఫాం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి తీవ్రతను గుర్తించి డెలివరీ చేసేందుకు వారు ముందుకు రాలేదు. 

దీంతో ఆమె బంధువులు మళ్లీ ప్లాట్‌ఫాం వద్దకు తీసుకురావటంతో వికాస్‌ ధైర్యం చేసి తన స్నేహితురాలి సహకారంతో పురుడు పోశాడు. అనంతరం తల్లి, బిడ్డను ప్రైవేటు అంబులెన్స్‌లో కూపర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంజీత్‌ థిల్లాన్‌ అనే వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేయటంతో వికాస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కజ్రత్‌ జమ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. వికాస్‌ చేసిన పని మహారాష్ట్రకు గర్వకారణమని పేర్కొన్నారు. దేవిక సూచనలతోనే తాను పురుడు పోయగలిగానని వికాస్‌ తెలిపాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)