Breaking News

Independence Day- 2024: త్రివర్ణాలతో వెలిగిపోతున్న ముంబై ఎయిర్‌ పోర్టు

Published on Thu, 08/15/2024 - 06:57

దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ  సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పలు నగరాలు అందంగా ముస్తాబయ్యాయి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ నేపధ్యంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒక అద్భుతమైన వీడియో షేర్‌ చేశారు. త్రివర్ఱాలతో వెలిగిపోతున్న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో షేర్ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాన్ని ఎలా అలంకరించారో ఈ వీడియోలో చూడవచ్చు. విమానాశ్రయం అంతా త్రివర్ణ పతాకాలతో మెరిసిపోతోంది. టెర్మినల్ వెలుపల, లాబీ, లైట్ హౌస్ మొదలైనవన్నీ వెలుగులమయంగా మారాయి.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గౌతమ్ అదానీ సోషల్‌ మీడియా సైట్‌ ఎక్స్‌లో.. ‘మన విమానాశ్రయ టెర్మినల్స్ త్రివర్ణాలతో సగర్వంగా నిలబడి ఉన్నాయి. ఇవి కేవలం తలుపులు మాత్రమే కాదు.. మన దేశ ప్రగతికి ప్రతీకలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా నిలుస్తామని చెప్పేందుకు, ఉజ్వల భవిష్యత్తుపై ఆశతో కొనసాగేందుకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు.  

విమానాశ్రయంలో పలు స్తంభాలను ఎంత వైభవంగా అలంకరించారో  గౌతమ్‌ అదానీ షేర్‌ చేసిన వీడియోలలో చూడవచ్చు. ఢిల్లీ తర్వాత దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ముంబై విమానాశ్రయం. ప్రయాణీకులకు అందించే సౌకర్యాల పరంగా ఈ విమానాశ్రయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)