Breaking News

Encounter: ముక్తార్ గ్యాంగ్ షూటర్ అనుజ్ హతం

Published on Sun, 03/30/2025 - 07:24

లక్నో: ముక్తార్ అన్సారీ ముఠాకు చెందిన షూటర్‌ అనుజ్ కనౌజియా(Anuj Kanaujia) పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇతనిపై 2.5 లక్షల రివార్డు ఉంది. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జార్ఖండ్ పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్‌ సంయుక్తంగా పాల్గొన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తొలుత ఎస్టీఎఫ్‌తో పాటు‌  జార్ఖండ్ పోలీసులు అనుజ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.

అయితే అనుజ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాల్పులు ప్రారంభించాడు. ఆ దరిమిలా ఇరు వైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో అనుజ్ మృతి చెందాడు. అనుజ్‌పై పలు నేరపూరిత కేసులు నమోదయ్యాయి. ముక్తార్ గ్యాంగ్‌(Mukhtar Gang)లో షూటర్‌గా అనుజ్ కీలకంగా వ్యవహరించాడు. యూపీలోని వివిధ జిల్లాల్లో పలు సెక్షన్ల కింద అనుజ్‌పై మొత్తం 23 కేసులు నమోదయ్యాయి.

అనుజ్ కనౌజియా గత కొన్నేళ్లుగా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో అనుజ్‌ హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌కు యూపీ ఎస్‌టీఎఫ్‌ డిప్యూటీ ఎస్పీ డీకే షాహి నాయకత్వం వహించారు. ఈయన ఎన్‌కౌంటర్‌(Encounter)లో గాయపడ్డారు. ‍ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డీకే షాహి యూపీ ఎస్టీఎఫ్‌లో కీలక అధికారిగా పేరొందారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని బండా జైలులో శిక్ష అనుభవిస్తున్న మాఫియా ముక్తార్ అన్సారీ 2024, మార్చి 28న మృతి చెందాడు. ఈ నేపధ్యంలో జైలు అధికారులు అన్సారీకి స్లో పాయిజన్ ఇచ్చారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో అన్సారీ గుండెపోటుతో మరణించినట్లు వెల్లడయ్యింది.

ఇది కూడా చదవండి: Myanmar: భూ ప్రకంపనల వైరల్‌ వీడియోలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)