Breaking News

జార్ఖండ్‌ ఎన్నికలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎమ్‌ఎస్‌ ధోనీ

Published on Sat, 10/26/2024 - 10:08

రాంచీ: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్‌ ధోనీ ఫోటోను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ వెల్లడించారు. ‘‘తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అంగీకారం తెలిపారు. ఇతర వివరాల కోసం మేము ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు’’ అని జార్ఖండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ కె.కుమార్ అన్నారు. 

స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. ముఖ్యంగా ఓటర్లకు.. ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలనే ఉత్సాహాన్ని పెంచేందుకు ధోనీ విజ్ఞప్తిని, ప్రజాదరణను వినియోగించుకోవాలని  ఎన్నికల సంఘం భావిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)