Breaking News

బయటపడిన మృత్యుబావి, మరో మందిరం

Published on Thu, 12/26/2024 - 13:30

సంభాల్‌: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈరోజు(గురువారం) మరో అద్భుతం బయటపడింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలో ఒక బావి కనిపించింది. ఈ బావి హిందువులు అధికంగా ఉంటున్న ప్రాంతంలో ఉంది. దీనిని మృత్యుబావిగా చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే ఒక ఆలయం ఉందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అని  స్థానికులు అంటున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం మట్టిలో కూరుకుపోయింది. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఇక్కడ ఆలయం తప్పకుండా కనిపిస్తుందని అంటున్నారు.

సంభాల్ ఒకప్పుడు పుణ్యక్షేత్రంగా ఉండేది. పురాణాల ప్రకారం సంభాల్‌లో 84 ప్రదక్షిణల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో 68 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెబుతారు. అలాగే 19 బావులు ఉన్నాయని, వాటిలో ప్రతిదానికీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అంటారు. ఇప్పుడు స్థానికులు ఈ తవ్వకాల పనుల్లో పాల్గొంటూ విలువైన ఆధారాలు సేకరిస్తున్నారు.  సంభాల్‌ను మతపరమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది.

ఇటీవల సంభాల్‌లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల కారణంగానే  ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఈ నేపధ్యంలోనే స్థానిక పరిపాలనాధికారులు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అదిమొదలు ఇక్కడ పలు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద బయటపడుతోంది. ‍ప్రస్తుతం ఇక్కడి చందౌసిలో కనిపించిన పురాతన మెట్ల బావిని శుభ్రం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మృత్యు బావి బయటపడింది. దీనిలో అందులో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని స్థానికులు చెబుతారు. ఇక్కడికి కొద్ది దూరంలో యమదగ్ని కుండ్ కూడా ఉందని అంటున్నారు. దీని కోసం పరిశోధనలు ప్రారంభమయ్యాయి.

ఇక్కడ మృత్యుంజయ దేవాలయం కూడా ఉండేదని, తమ ముందు తరాలవారు తమకు ఈ విషయం చెప్పారని, పరిశోధిస్తే అది కూడా బయటపడుతుందని స్థానికులు అంటున్నారు. దాని గోడలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం మట్టిలో కూరుకుపోయిన కట్టడాలను పరిశోధించేదిశగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం మృత్యుబావిని కనుగొనేందుకు తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చందౌసిలో పలు పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 

ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)