Breaking News

చాక్లెట్‌లో పళ్ల సెట్‌.. కంగుతిన్న టీచర్‌

Published on Tue, 07/23/2024 - 21:32

పుట్టిన రోజు సందర్భంగా పిల్లలు ఇచ్చిన చాక్లెట్లు తిన్న ఓ రిటైర్డ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు తీపు కబురు కాస్త పీడకలగా మారింది.

మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌లో మాయాదేవి గుప్తా స్కూల్‌ ప్రినిపాల్‌గా రిటైరయ్యారు. ప్రస్తుతం ఓ ఎన్‌జీవోలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్‌జీవోలో పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుగుతుంటాయి. ఎప్పటిలాగే ఆ ఎన్‌జీవోలో పిల్లల పుట్టిన రోజులు ఘనంగా జరిగాయి

పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఓ విద్యార్ధి మాయాదేవికి చాక్లెట్‌ ఇచ్చాడు. అయితే, ఎంతో ఆనందంతో ఆ చాక్లెట్లు తినేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఏమైందంటే 

‘విద్యార్ధి నాకు ఒక పాపులర్ బ్రాండ్‌కి చెందిన కాఫీ ఫ్లేవర్ చాక్లెట్‌ ఇచ్చాడు. చాక్లెట్ తిన్నాక ఏదో కరకరలాడే చాక్లెట్ ముక్కలా అనిపించింది. మరోసారి నమలడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యపడలేదు. వెంటనే చాక్లెట్‌ను పరీక్షించగా అందులో నాలుగు దంతాల పళ్ల సెట్‌ చూసి కంగుతిన్నాను.’అని తెలిపారు.

వెంటనే ఖర్గోన్‌లోని జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్‌కు మాయాదేవి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై  పిల్లలు చాక్లెట్లు కొనుగోలు చేసిన దుఖాణం నుంచి అధికారులు చాక్లెట్‌ నమూనాలను సేకరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హెచ్‌ఎల్ అవాసియా ఈ నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)