Breaking News

మీకు దమ్ముందా?.. విక్రమ్‌ మిస్రీపై ట్రోల్స్‌కు శశిథరూర్‌ కౌంటర్‌

Published on Mon, 05/12/2025 - 11:08

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ (Vikram Misri) బహిర్గతం చేశారు. ఈ ప్రకటన అనంతరం కొందరు నెటిజన్లు.. సోషల్‌ మీడియాలో ఆయనపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. దీనిపై తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) స్పందిస్తూ ట్రోలింగ్‌ చేస్తున్న వారికి కౌంటరిచ్చారు.

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భారత్‌, పాకిస్తాన్‌ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న సమయంలో విక్రమ్‌ మిస్రీ అద్భుతమైన పనితీరు కనబరిచారు. భారత్‌ గొంతును వినిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. అలాంటి అధికారిని ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిస్రీపై విమర్శలు చేస్తున్నవారు ఆయన కంటే భిన్నంగా, మెరుగ్గా చేయగలరా?’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో భారత ఆర్మీ కర్నల్‌ సోఫియా ఖురేషీ, నేవీ వింగ్‌ కమాండర్‌-హెలికాప్టర్‌ పైలట్‌ వ్యోమికా సింగ్‌ల పనితీరుపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. వారి పనితీరు అద్భుతమని కొనియాడారు.

అంతకుముందు.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం ప్రకటన అనంతరం.. కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా విక్రమ్‌ మిస్రీపై ట్రోల్స్‌ చేయడం ప్రారంభించారు. ఆయన వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న పౌర సేవకులపై వ్యక్తిగతంగా ఇలాంటి ట్రోల్స్‌ చేయడం విచారకరమని ఐఏఎస్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి