Breaking News

మౌంట్‌ ఎవరెస్ట్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్‌!

Published on Sun, 05/26/2024 - 14:16

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై  పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఈ ఉన్నత పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.  

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య ప్రతి ఏటా వేగంగా పెరుగుతోంది. బేస్ క్యాంప్‌లో పర్యాటకులు క్యూ కడుతున్నారు. బీబీసీ నివేదిక ప్రకారం  ఇటీవల ఇద్దరు పర్వతారోహకులు మృతి చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వందలాది మంది పర్వతారోహకుల క్యూ కనిపిస్తుంది. వీరిని చూస్తుంటే నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారేమోనని అనిపిస్తుంది.

ఈ ఫొటోను చూసిన ది నార్తర్నర్ అనే యూజర్‌  ఇలా రాశాడు. ‘ఎవరెస్ట్  అతి ఎత్తయిన శిఖరం. అయిత ఇప్పుడది మురికిగా మారింది. ఇక్కడ మనుషుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. మంచులో కూరుకుపోతున్నవారికి సహాయం  అందించేందుకు ఇక్కడ ఎవరూ లేరు. కాలుష్యం మరింతగా పెరుగుతోంది. చుట్టూ దుమ్ము, ధూళి కనిపిస్తోంది. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుంది?’ అని ప్రశ్నించాడు.

భారత పర్వతారోహకుడు రాజన్ ద్వివేది మే 19 ఉదయం 6 గంటలకు ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఆయన అక్కడి పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో ‘ఎవరెస్ట్  పర్వతారోహణ అంత సులభం కాదు. 1953 మేలో తొలిసారిగా ఎవరెస్ట్‌ అధిరోహించారు. అప్పటి నుంచి  ఇప్పటి వరకూ  మొత్తం  ఏడు వేల మంది ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అయితే ఇక్కడి చలి వాతావరణం, గాయాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మృతి చెందిన వారికి సంబంధించిన డేటా ఎక్కడా లేదు. దానిని ఎవరూ లెక్కించడం లేదు. గంటకు 100 నుండి 240 మైళ్ల వేగంతో వీచే బలమైన గాలులను ఎదుర్కోవడం పర్వతారోహకులకు పెద్ద సవాలు’ అని ఆయన పేర్కొన్నారు. రాజన్ ద్వివేది ఒక వీడియోను కూడా షేర్‌ చేశారు. ఆ వీడియోలో మంచు శిఖరాలపై  లెక్కకు మించిన పర్వతారోహకులు కనిపిస్తారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)