Breaking News

రతన్‌ టాటా..రతనాల మాటలు

Published on Thu, 10/10/2024 - 08:14

ఢిల్లీ : బిజినెస్‌ టైకూన్, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా యావత్ భారతం ఘన నివాళులర్పిస్తుండగా.. రతన్ టాటా పలు సందర్భాలలో జీవితాల్ని మార్చేసే స్పూర్తిదాయకమైన ప్రసంగాల్ని గుర్తు చేసుకుంటున్నారు.  

👉‘జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం’

👉కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిలేదని ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషమూ ఉంది.

👉తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు

👉వృత్తిని – జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని – జీవితాన్ని మమేకం చేయాలి. 
మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.

👉ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్‌నూ స్వీకరించ లేకపోతే అపజయం తప్పదు.

👉ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు

👉ఎదుటివాళ్ల దయా గుణాన్ని, ప్రేమను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి

👉మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం, నమ్మకం మనకో దారి చూపిస్తాయి.

👉అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. అవకాశాల్ని సృష్టించుకోవాలి.

👉నాయకత్వమంటే బాధ్యత తీసుకోవడం

👉సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు దృష్టి లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయడమే నా పని.

👉విజయం అనేది నీవు చేపట్టిన పదవిపై ఆధారపడి ఉండదు. నీవు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది. 

భవిష్యత్ తరాలకు రతన్ టాటా రతనాల మాటలు

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)