Breaking News

ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...

Published on Mon, 06/05/2023 - 10:08

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 270కిపైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మూడు రైళ్లు ఢీకొన్న నేపధ్యంలో కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంటనే తేరుకున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. ఇదేరీతిలో ఒక మహిళ ఎంతో ధైర్యంతో తన ముగ్గురు పిల్లలను కాపాడుకుంది.

రైళ్లు ఢీకొన్న సమయంలో చాలా బోగీలు చెల్లాచెదురైపోయాయి. ఇదేవిధంగా పక్కకు ఒరిగిపోతున్న బోగీలో ఉన్న ఒక మాతృమూర్తి ఎంతో ధైర్యం, సమయస్ఫూర్తితో తన పిల్లల ప్రాణాలను రక్షించింది. రైళ్లు ఢీకొన్న సమయంలో ప్రయాణికుల అరుపులు, కేకలు విన్న సీతాదాస్‌ అనే 45 ఏళ్ల మహిళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇద్దరు కుమార్తెలను ఒక కుమారుడిని బోగీలోని ​కిటికీలో నుంచి బయటకు విసిరివేసింది. ఆ రైలు పట్టాలకు ఒకవైపు పంట పొలాలు ఉన్నాయి.

ఆ చిన్నారులను ఆమె ఆ పంటపొలాలలోకి విసిరివేసింది. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రమాదం జరిగిన సమయంలో ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమని అనిపించిందని, అందుకే పిల్లలను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నానన్నారు. వెంటనే పిల్లలను కిటికీలో నుంచి బయటకు తోసివేశానని’ తెలిపారు.  కాగా ఈ ప్రమాదంలో సీతతో పాటు ఆమె భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విపత్కర సమయంలో అంత్యంత తెలివితేటలతో పిల్లలను కాపాడుకున్న ఆమెను అందరూ అభినందిస్తున్నారు. 

చదవండి: ‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’ 

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)