ఐదో ప్రేమికునితో ముగ్గురు పిల్లల తల్లి పరార్‌.. పోస్టర్‌తో భర్త వెదుకులాట!

Published on Sun, 09/03/2023 - 13:39

ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో ముగ్గురు పిల్లల తల్లి తన ఐదవ ప్రేమికునితో వెళ్లిపోయింది. బాధిత భర్త తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని, చేతిలో భార్యకు సంబంధించిన ఫొటో పోస్టర్‌తో తిరుగుతూ ఆమె ఆచూకీ కోసం ​ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ అతని ప్రయత్నాలు ఫలించలేదు. తన భార్య  అదృశ్యమయ్యిందంటూ ఆ భర్త పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశాడు. 

భర్త అనిల్‌ రాజ్‌భర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను పనుల నిమిత్తం గతంలో చండీగఢ్‌ వెళ్లానని, అక్కడే రీనా అనే యువతితో పరిచయం అయ్యిందని తెలిపాడు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో తాము వింద్యాచల్‌ మందిరంలో పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. పెళ్లి తరువాత తాము గ్రామానికి వచ్చేశామని, ఇక్కడే కాపురం పెట్టామని, తమకు ముగ్గురు పిల్లలు కలిగారని తెలిపాడు. ఈ విధంగా 9 ఏళ్లు గడిచిందని పేర్కొన్నాడు. 

బాధితుడు రాజ్‌భర్‌ పని నిమిత్తం తరచూ ఇతర ప్రాంతాలకు వెళుతుండేవాడు. ఈ సమయంలో ఆమె ఎవరితోనే మాట్లాడుతుండేదని రాజ్‌భర్‌ గమనించాడు. ఈ విషయమై ఆమెను ప్రశ్నంచగా ఆమె జవాబు చెప్పకుండా తప్పించుకునేది. అయితే ఇటీవల ఆమెకు ఎవరి దగ్గరి నుంచో ఫోను వచ్చింది. దీంతో ఆమె బయట ఏదో పని ఉందని వెళ్లింది. రాజ్‌భర్‌ సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి ఆమె ఇంటిలో లేదు. పిలలకు కూడా తల్లి ఎక్కడకు వెళ్లిందో తెలియలేదు. 

దీంతో తమకు తెలిసిన అన్ని ప్రాంతాలలోనూ వెదికినా రాజ్‌భర్‌కు భార్య ఆచూకీ దొరకలేదు. దీంతో అతను తన భార్య అదృశ్యం అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నెల్లాళ్లు గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రాజ్‌భర్‌ తన భార్యకు సంబంధించిన పోస్టర్‌తో తనకు తెలిసిన అన్నిప్రాంతాల్లో తిరుగుతూ, భార్యకోసం వెదుకుతున్నాడు. రాజ్‌భర్‌ మీడియాతో  మాట్లాడుతూ తన భార్య గతంలో తనకు ఎంతో మంది స్నేహితులు, ప్రేమికులు ఉండేవారని చెప్పేదని, దానిని తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అయితే అప్పుడప్పుడు ఆమె తన ఐదవ ప్రేమికుని గురించి చేప్పేదని, అతనితోనే తన భార్య వెళ్లిపోయి ఉండవచ్చనే అనుమానం కలుగుతున్నదని రాజ్‌ భర్‌ పేర్కొన్నాడు. 
ఇది కూడా చదవండి:ప్రపంచం మెచ్చిన ఐదుగురు హిందూ రాజులు 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)