ఆరుసార్లు అమ్మాయి.. మళ్లీ అదే పరిస్థితి.. కన్నీరు పెట్టిస్తున్న ‘అమ్మ’ ఉత్తరం

Published on Fri, 05/26/2023 - 14:25

‘ఇప్పటికే నాకు ఆరుగురు ఆడ పిల్లలు పుట్టారు. మళ్ల అమ్మాయే పుట్టింది. మా అత్త నన్నెంతో ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ పని చేస్తున్నాను. మీకు అనుకూలంగా ఉంటే నా కుమార్తెను పెంచండి. నన్ను క్షమించండి’.. అత్యంత నిస్సహాయ పరిస్థితిలో ఒక మాతృమూర్తి చేసుకున్న అక్షర వేదన ఇది. ఆ తల్లి తన నవజాత ఆడ శిశువును ఒంటరిగా ఆ మహిళా ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది.

ఆమెకు ఇప్పటికే ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏడవ సంతానం కూడా ఆడపిల్లే కలిగింది. అత్తింటిలో పోరు పడలేక ఆ మహిళ తన కుమార్తెను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆమె ఒక లెటర్‌ను కూడా అక్కడ ఉంచింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాగా ఆసుపత్రిలో రోదిస్తున్న శిశువును గమనించిన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అలాగే ఆ చిన్నారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేశారు.

ఈ ఉదంతం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. నవజాత శిశువును వైద్యులు వార్డుకు తరలించారు.ఈ సందర్భంగా భరత్‌పూర్‌ జనతా ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ హిమాంశు గోయల్‌ మాట్లాడుతూ ఈ చిన్నారి 3 రోజుల క్రితమే జన్మించిందని అన్నారు. చిన్నారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 
చదవండి: అది చరిత్రలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)