Breaking News

కొండచరియలు మీదపడినా తల్లిప్రేమ సజీవం.. కంటతడి పెట్టించే దృశ్యం

Published on Sat, 09/20/2025 - 11:34

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే సమయంలో కొండచరియలు విరిగిపడుతూ కొన్ని కుటుంబాలను సమాధి చేశాయి. ఇక్కడి కుంటారి లగాఫాలిలో కొండచరియలు విరిగిపడిన దరిమిలా రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వారికి హృదయాలను కలచివేసే దృశ్యం కనిపించింది.

శిథిలాల కింద కూరుకుపోయిన కాంత దేవి(38) తన పదేళ్ల కవల పిల్లలను చేతులతో గట్టిగా పట్టుకుని అలానే ప్రాణాలు వీడింది. ఆ చిన్నారులు కూడా తల్లిని గట్టిగా పట్టుకున్నారు. దుర్ఘటన సమయంలో వారు ఒక చోట చిక్కుకుని కన్నుమూశారు. ఆ తల్లి చివరి క్షణం వరకూ తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిందని ఈ హృదయవిదారక దృశ్యం తెలియజేస్తోంది.

కాంత దేవి భర్త కున్వర్ సింగ్ తమ ఇంటి శిథిల అవశేషాల కింద 16 గంటలపాటు విలవిలలాడి, తర్వాత రెస్క్యూ సిబ్బంది సాయంతో సజీవంగా బయటపడ్డాడు.  ఇప్పుడు అతనికి కుటుంబమూ లేదు. ఇల్లూ లేదు. దుఃఖం ఒక్కటే మిగిలింది. అతని పరిస్థితి తెలుసుకున్న వారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. కొండచరియలు విరిగిపడిన ఈ ప్రాంతంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)లు కట్టర్ యంత్రాలతో టన్నుల కొద్దీ శిథిలాలను తవ్వుతూ 32 గంటలపాటు శ్రమించాయి.

గ్రామంలోని కొన్న కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి. స్థానికంగా ఉంటున్న సుబేదార్ మేజర్ దిల్బార్ సింగ్ రావత్ తన భార్య కళ్ల ముందే మృతిచెందాడు. ప్రమాదం గురించి తోటివారిని హెచ్చరించిన నరేంద్ర సింగ్  కొండచరియలు విరిగిపడిన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే  అతని హెచ్చరిక చాలా మందిని కాపాడింది. ప్రణాళిక లేని నిర్మాణాల కారణంగా విపత్తు మరింతగా పెరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)