Breaking News

ఓటుకు సిద్ధం.. 100 ఏళ్లు దాటిన 2,000 మంది ఓటర్లు!

Published on Tue, 05/07/2024 - 07:35

ఛత్తీస్‌గఢ్‌లో నేడు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒక కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనుండగా, వారిలో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి సారి ఓటు వేయబోయేవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. రాష్ట్రంలోని సుర్గుజా, రాయ్‌గఢ్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్‌పూర్, దుర్గ్, రాయ్‌పూర్‌లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 26.

పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రింకింగ్ వాటర్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. క్యూలో నిలుచునే ఓటర్లకు నీడను కల్పించారు. వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచారు.

రాష్ట​ంలోని ఏడు స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. మూడో దశలో 26 మంది మహిళలతో సహా మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. రాయ్‌పూర్‌లో అత్యధికంగా 38 మంది, బిలాస్‌పూర్‌లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్‌లో 25 మంది, జాంజ్‌గిర్-చంపాలో 18 మంది, రాయ్‌గఢ్‌లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 15,701 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 25 పోలింగ్‌ కేంద్రాలను హైపర్‌ సెన్సిటివ్‌గా, 1072 పోలింగ్‌ కేంద్రాలను సెన్సిటివ్‌గా వర్గీకరించారు. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)