Breaking News

అమర్‌నాథ్‌కు పోటెత్తుతున్న భక్తులు

Published on Mon, 07/01/2024 - 10:24

జమ్ముకశ్మీర్‌లో ప్రతీయేటా జరిగే అమర్‌నాథ్‌యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు. మహాశివుని నామస్మరణలతో జరుగుతున్న యాత్రలో రెండవ రోజున (ఆదివారం) సుమారు 14,717 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 28 వేల మంది అమరనాథుని దర్శనం చేసుకున్నారు.

అమర్‌నాథ్‌ యాత్ర చేసేందుకు తాజాగా పహల్‌గావ్‌, బాల్టల్‌ల నుంచి రెండవ బృందం బయలుదేరింది. మొత్తం 309 వాహనాలలో బాల్టన్‌ మార్గంలో 2,106 మంది పురుషులు, 11 మంది పిల్లలు, 115 మంది సాధువులు, 41 మంది సాధ్విలు యాత్రకు బయలుదేరారు. ఈ మార్గంలో స్థానికులు యాత్రికులకు స్వాగతం పలికారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు అమర్‌నాథ్‌ యాత్రకు వెళుతున్న భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

శ్రీనగర్‌లోని వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై మొదటివారం నుంచి వర్షాలు కురియనున్నాయి. 25వ సారి అమర్‌నాథ్‌ యాత్ర చేస్తున్న కృష్ణకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ గతంలోకన్నా ప్రస్తుతం ఏర్భాట్లు బాగున్నాయని అన్నారు. తాను కోవిడ్‌ సమయంలోనూ హెలికాప్టర్‌లో అమర్‌నాథ్‌ యాత్ర చేసుకున్నానని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)