Breaking News

యువకుని ప్రాణాలు తీసిన మూమూస్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌

Published on Sun, 07/16/2023 - 10:57

ఒక్కోసారి చిన్నచిన్న సరదాలే ‍ప్రాణాలమీదకు తీసుకొస్తుంటాయి. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో స్నేహితులు చేసిన మూమూస్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్నేహితులు పెట్టిన షరతులకు మించి మూమూస్‌ తినడంతో ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడని, అనంతరం ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుని తండ్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తన కుమారునికి విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు ఎంజాయ్‌ చేస్తూ, వారిలోవారు మూమూస్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్‌ కుమార్‌(25) ఛాలెంజ్‌కు మించి అధికంగా మూమూస్‌ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్‌ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

బిపిన్‌ ఒక మొబైల్‌ రిపేరింగ్‌ దుకాణంలో పనిచేస్తుంటాడు. కుమారుని మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్‌ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)