Breaking News

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలుగా మోహన్‌ యాదవ్, విష్ణుదేవ్‌ ప్రమాణం

Published on Thu, 12/14/2023 - 04:35

భోపాల్‌/రాయ్‌పూర్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని లాల్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ మంగూభాయి పటేల్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్‌ దేవ్‌దా, రాజేంద్ర శుక్లా ప్రమాణం చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్‌ యాదవ్‌ ఉజ్జయిని సౌత్‌ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తానని చెప్పారు.

అలాగే ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో సీఎంగా విష్ణుదేవ్‌ సాయితో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్‌ సావో, విజయ్‌ శర్మ ప్రమాణం చేశారు. మోహన్‌ యాదవ్, విష్ణుదేవ్‌ సాయి ప్రమాణం స్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.    
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)