Breaking News

యుద్ధ రీతుల్లో పెనుమార్పులు 

Published on Sat, 11/01/2025 - 05:25

న్యూఢిల్లీ:  ఆధునిక యుగంలో యుద్ధరీతుల్లో పెనుమార్పులు వస్తున్నాయని భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. బాంబులు, తూటాలు లాంటి భౌతికమైన బలంతో సంబంధం లేని యుద్ధాలు మొదలయ్యాయని అన్నారు. శత్రువును కంటితో చూడకుండానే అంతం చేసే సాంకేతికత వచ్చిందని తెలిపారు. ఇప్పటియుద్ధాలకు సైనిక బలంతోపాటు మేధస్సు, టెక్నాలజీ, నైతిక సంసిద్ధత అవసరమవుతున్నాయని వివరించారు. 

సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర ద్వివేది ప్రసంగించారు. ఇతర దేశాలకు లేని సానుకూలతలు మనకు ఉన్నాయని తెలిపారు. యువ జనాభా అధికంగా ఉండడం మన బలమని పేర్కొన్నారు. మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా మన సంసిద్ధం కావాలని స్పష్టంచేశారు. 

నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, యుద్ధ వ్యూహాలు మార్చుకోవాలని వెల్లడించారు. సంప్రదాయ శత్రువులు మనకు ఉన్నారని గుర్తుచేశారు. ఉగ్రవాదం, అంతర్గత సమస్యలు సవాళ్లు విసురుతున్నాయని ఉద్ఘాటించారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తున్న తప్పుడు సమాచారం వ్యాప్తిని కచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఘర్షణలు సృష్టించాలన్న లక్ష్యంతో తప్పుడు ప్రచారం సాగుతోందని వెల్లడించారు. 

ఇప్పుడు యుద్ధం అనేది క్షేత్రస్థాయిలో కాకుండా.. ఫైబర్‌ కేబుళ్ల ద్వారా జరుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ భద్రతతోపాటు దేశ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. దేశ భద్రతలో ప్రభుత్వం, పౌర సమాజం పాలుపంచుకోవాలని సూచించారు. దేశ భద్రత అనేది కేవలం సైన్యం, సరిహద్దులకు సంబంధించిన అంశం కాదని.. అది ప్రజలకు సంబంధించిన అంశమని తేలి్చచెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, కల్నల్‌ సోఫియా ఖురేషీ తదితరులు పాల్గొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)