Breaking News

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టులు మృతి

Published on Wed, 07/17/2024 - 20:59

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుంచి 15మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో పోలీసులు ఆపరేషన్‌ చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు ఆరు గంటల పాటు జరగ్గా.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, మూడు ఏకే 47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక, కాల్పుల సందర్భంగా తిపాగడ్‌ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్‌ ఆత్రం అలియాస్‌ విశాల్‌ ఆత్రం మృతిచెందినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు బుల్లెట్‌ గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు