Breaking News

బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు..

Published on Sat, 06/17/2023 - 10:33

తమిళనాడు:ప్రతిపక్షాలతో బీజేపీ ఎన్నికల్లో పోరాడటంలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికల్లో పోరాడి బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు. 

కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నిరసన సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసత్య ప్రచారాలతో బీజేపీ సృష్టించుకున్న ఇమేజ్‌ను దెబ్బతీస్తామని అన్నారు.   

'బీజేపీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై దురహంకార చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడమే బీజేపీ శవపేటికకు చివరి మేకు అవుతుంది' అని స్టాలిన్ అన్నారు. 

మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనలు తెలుపుతూ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ సమావేశం నిర్వహించింది.  

ఇదీ చదవండి:ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్‌

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు