Breaking News

కూతురి కోసం తల్లిదండ్రుల ఆక్రోశం

Published on Sun, 08/11/2024 - 08:38

యశవంతపుర: మంగళూరులో మతాంతర పెళ్లి కలకలం రేపింది. హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేశారు. వివరాలు.. మంగళూరుకు చెందిన విస్మయ అనే యువతి బీసీఎ పూర్తి చేసింది. పొరుగున కేరళకు చెందిన మహమ్మద్‌ అషా్వక్‌తో ఆమెకు పరిచయమై ప్రేమలో పడ్డారు. రెండు నెలల పరిచయంతోనే విస్మయను బ్రెయిన్‌వాష్‌ చేసి లవ్‌లో పడేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. జూన్‌ 6న ఉళ్లాల నుంచి విస్మయను అషా్వక్‌ తీసుకెళ్లగా తల్లిదండ్రులు ఉళ్లాల పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు.

 పోలీసులు గాలించి విస్మయను తల్లిదండ్రులకు అప్పగించారు. మళ్లీ జూన్‌ 30న ఉళ్లాల నుంచి విస్మయను తీసుకెళ్లాడు. విస్మయను తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఫలితం లేదని తల్లిదండ్రులు వాపోయారు. కేరళలో మతమారి్పడి చేసి పెళ్లి చేసుకున్నాడని విస్మయ తండ్రి వినోద్‌ తెలిపారు. 

తల్లిదండ్రులు, హిందూ సంఘాల నాయకులు విస్మయకు నచ్చజెప్పినా వినలేదు. మరోవైపు తన భార్యను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారంటూ భర్త కేరళలో హైకోర్టులో కేసు వేశాడు. ప్రస్తుతం ఆ జంట కేరళ కాసరగోడు విద్యానగరలో కాపురం పెట్టారు. తన కూతురిని కాపాడాలంటూ తండ్రి హిందూసంఘాల నేతలకు మొరపెట్టుకున్నారు.   

#

Tags : 1

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)