Breaking News

కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ ఎలా?

Published on Thu, 05/08/2025 - 04:00

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల పునరుద్ధరణ అంశంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అతుల్‌జైన్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చర్చలు జరిపారు. వేల కోట్లతో నిర్మించిన బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తేవాలనే దృఢమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, సీడబ్ల్యూసీ నిర్దిష్ట మార్గదర్శకాలు సూచిస్తే, వాటికి అనుగుణంగా ముందుకు వెళతామని ఈ సందర్భంగా ఉత్తమ్‌ వివరించారు. 

తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో బుధవారం జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనా«థ్‌ దాస్, ఈఎన్‌సీ అనిల్‌కుమార్, సీఈలు బస్వరాజు, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై చర్చించారు. అతుల్‌ జైన్‌ మాట్లాడుతూ.. ఈ బరాజ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను తమకు నివేదిక రూపంలో అందిస్తే, పరిశీలించి తగు మార్గదర్శకాలు సూచిస్తామని హామీ ఇచ్చారు.  

నీటి కేటాయింపులు జరపండి: అతుల్‌ జైన్‌ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఉండే ముంపు సమస్యపై సమగ్ర అధ్యయనం చేయించాలని మంత్రి ఉత్తమ్‌ కోరారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డికి అవసరమైన 90 టీఎంసీల నీటిలో మొదటి దశ కింద 45 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  

పునరుద్ధరణ మార్గాలు అన్వేషిస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌ 
మేడిగడ్డ సహా కాళేశ్వరం మూడు బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తేవడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కాకూడదన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ నిర్లక్ష్యం, డిజైన్, లొకేషన్, నిర్మాణం, ఓఅండ్‌ఎం లోపాల వల్లే ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. కృష్ణా జలాల్లో సమర్ధ నీటి వినియోగం ఉండేలా, అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌ నీటిని మళ్లించకుండా నీటి లెక్కలు పక్కాగా ఉండేలా టెలీమెట్రీ వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)