Breaking News

కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు

Published on Tue, 10/15/2024 - 12:51

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి సౌందర్యం ప్రపంచం నలుమూలల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విదేశీ వలస పక్షులకు శీతాకాలపు ఆవాసాలుగా మారే ప్రదేశాలు ఉత్తరాఖండ్‌లో అనేకం ఉన్నాయి. వాటిలో  ఒకటి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది ప్రతియేటా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వలస పక్షులకు సురక్షితమైన గమ్యస్థానంగా  ఉంది.

అక్టోబర్ వచ్చేసరికి సెంట్రల్ ఆసియా, సైబీరియా, కజకిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా తదితర శీతల ప్రాంతాల నుండి వేలాది విదేశీ పక్షులు అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు తరలివస్తాయి. కఠినమైన శీతాకాలం నుండి తప్పించుకునేందుకు ఈ పక్షులు డెహ్రాడూన్‌లోని  ఈ అందమైన ప్రదేశానికి వచ్చి నివసిస్తాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆరు వేలకుపైగా విదేశీ పక్షులు ఇక్కడికి తరలివస్తాయి. మార్చిలో అవి మళ్లీ తమ స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఈసారి అక్టోబరులోనే 300లకు పైగా పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి.

రడ్డీ షెల్డక్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, కామన్ పోచార్డ్, యురేషియన్ విజియన్ వంటి పక్షులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ అందమైన నీటి పక్షులను చూడటానికి పక్షి ప్రేమికులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి తరలివస్తుంటారు. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌లో పక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెహ్రాడూన్ నుండి చక్రతా జాతీయ రహదారి మీదుగా హెర్బర్ట్‌పూర్ చేరుకోవచ్చు. అసన్ కన్జర్వేషన్  ఇక్కడికి  ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే గూగుల్‌ మొదటి ఒప్పందం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)