Breaking News

ఆగ్రాలో కుప్పకూలిన MiG-29 విమానం..

Published on Mon, 11/04/2024 - 17:19

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-‌29 ఫైటర్‌ జెట్‌ విమానం సోమవారం  కుప్పకూలిపోయింది. విమానం నెల కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం నుంచి పైలట్‌, కో పైలట్‌ సురక్షింతంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమానం నుంచి కిందకు దూకి ఇద్దరు పైలెట్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

పంజాబ్‌ అదంపూర్‌ నుంచి ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  అయితే విమానం ల్యాండింగ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ విమానం కూలిపోయిందని, జనావాస ప్రాంతంలో కూలి ఉంటే భారీ నష్టం జరిగేదని పేర్కొన్నారు. ప్రమాదంపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారు

అయితే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మిగ్‌-29 విమానం కూలడానికి కారణాలు తెలియరాలేదు. విమానం కూలిన ప్రదేశంలో జెట్‌ నుంచి పొగలు వెలువడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయి మంటలు చెలరేగడం ఇదేం మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2న రాజస్థాన్‌లోని బార్మర్‌లో సాంకేతిక లోపంతో మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలోనూ ప్రమాదానికి ముందు పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)