Breaking News

తల్లి ఊపిరి ఆగిందని తెలియక..

Published on Sat, 01/25/2025 - 12:31

సేలం(తమిళనాడు): తల్లి మరణించిందని తెలియని మానసిక రోగి అయిన కుమారుడు ఆస్పత్రి నుంచి ఆమెను సైకిల్‌పై తన నడుముకు కట్టుకుని 15 కిలోమీటర్లు పయనించాడు. ఈ ఘటన తమిళనాడులోని నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. నెల్‌లై జిల్లా నాంగునేరి సమీపంలో వడక్కు మీన్‌వన్‌కుళం, మాతాకోవిల్‌ వీధికి చెందిన బాలన్‌ (38) మానసిక రోగి. ఇతని తల్లి శివగామి అమ్మాల్‌ (60) కూడా మానసిక రోగి. వీరు నెల్‌లై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్య విభాగంలో చికిత్స పొందుతూ వచ్చారు. 

ఈ స్థితిలో వృద్ధాప్యం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను నాంగునేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి బాలన్‌ వైద్యం చేయిస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా శివకామి అమ్మాల్‌ కింద పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దీంతో ఆమెను నెల్‌లై ప్రభుత్వ ఆస్పత్రిలో బాలన్‌ చేర్చాడు. ఈ స్థితిలో గురువారం నెల్‌లై ఆస్పత్రిలో ఉన్న తల్లిని బాలన్‌ బయటకు తీసుకొచ్చాడు. తర్వాత తన సైకిల్‌పై కూర్చోబెట్టుకున్నాడు.

 కిందకు వాలిపోతున్న ఆమెను తాడుతో తన నడుముకు కట్టుకుని సైకిల్‌పై బయలుదేరాడు. అక్కడి నుంచి 15 కిలో మీటర్ల దూరం నెల్‌లై–కన్యాకుమారి జాతీయ రహదారిపై వెళ్లాడు. రాత్రి మూండ్రైపాళయం వద్ద బాలన్‌ సైకిల్‌పై నిలిచి ఉండగా, అక్కడ ఉన్న వారు బాలన్‌ వెనుక కూర్చుని ఉన్న తల్లి మృతిచెందినట్టు గుర్తించారు. తర్వాత మానసిక రుగ్మతతో ఉన్న కుమారుడు తల్లి మరణించిన విషయం కూడా తెలియకుండా సైకిల్‌పై వచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న కీల్‌కడంలో ఉన్న బాలన్‌ సోదరుడు సవరిముత్తు (43)ను రప్పించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  video credit to : Dinamalar 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)