Breaking News

Chhattisgarh: నెలసరి సెలవు విధానం అమలు

Published on Thu, 07/25/2024 - 11:42

ఛత్తీస్‌గఢ్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎల్‌యూ) విద్యార్థినులకు పీరియడ్స్‌ సెలవు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి యూనివర్శిటీలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

హెచ్‌ఎన్‌ఎల్‌యు చేపట్టిన ‘హెల్త్ షీల్డ్’ కార్యక్రమంలో భాగంగానే ఈ సెలవు విధానం అమలు చేసినట్లు యూనివర్సిటీ  తెలియజేసింది. ఈ  సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ.సీ. వివేకానందన్‌ మాట్లాడుతూ యువ విద్యార్థినుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీరియడ్స్‌ సెలవు విధానాన్ని అమలు చేయడం  మెచ్చుకోదగిన విధానమని అన్నారు. దీనికి మద్దతిచ్చినందుకు అకడమిక్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

యూనివర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ విధానంలో విద్యార్థినులు క్యాలెండర్ నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరీక్షా రోజులలో కూడా ఇటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. క్రమరహిత ఋతు సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి రుగ్మతలు ఉన్న బాలికలు ఒక సెమిస్టర్‌లో ఆరు రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చని అన్నారు.

అంతకుముందు 2023 జనవరిలో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలో తొలిసారిగా పీరియడ్స్‌ సెలవు విధానాన్ని ప్రారంభించింది. అనంతరం పంజాబ్ యూనివర్శిటీ ఆఫ్ చండీగఢ్, గువాహటి యూనివర్శిటీ ఆఫ్ అస్సాం, నల్సార్ యూనివర్శిటీ (హైదరాబాద్), అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్శిటీలు కూడా ఈ విధమైన సెలవు విధానాన్ని ప్రారంభించాయి.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)