Breaking News

ఘనంగా సీమంతం..అంతలోనే విషాదం!

Published on Thu, 08/07/2025 - 11:15

నెలలు నిండాయి, ఇటీవలే ఘనంగా సీమంతం వేడుక చేశారు.   కొడుకో, కూతురో పుడితే ఇల్లంతా సందడిగా ఉంటుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం వారి ఆశలను తుంచేసింది.

దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని తల్లీ బిడ్డ హైటెక్‌ ఆస్పత్రిలో ఘోరం చోటుచేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళ, కడుపులో శిశువు మృత్యువాత పడ్డారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ కాటికి పోయారని ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. దొడ్డ తాలూకా సింగేనహళ్లి నివాసి సుశి్మత (24) మొదటిసారి గర్భం దాల్చింది. దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చూపించగా 7న కాన్పు తేదీ ఇచ్చారు. అయితే మంగళవారంనాడు సుస్మితకు ఊపిరి ఆడడం లేదని కుటుంబీకులు ఆస్పత్రికి తీసకువచ్చారు. 

ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్‌ లేకపోవడంతో నర్స్‌ మాత్రలు ఇచ్చి ఏమీ కాదని చెప్పింది. దీంతో వారు ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం పొద్దున హఠాత్తుగా సుశి్మత ఆరోగ్యం క్షీణించి మరణించింది. త్వరలో కాన్పు అయి పండంటి బిడ్డను చూస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. వైద్యుల న్లిక్ష్యం, సమయానికి డాక్టర్‌ లేకపోవడం వల్లే గర్భిణి, కడుపులోని బిడ్డ చనిపోయారని దుయ్యబట్టారు. తరువాత పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

బెంగళూరులో బాలింత..  
యశవంతపుర: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రసవమైన గంటలో బాలింత మరణించిన ఘటన బెంగళూరులో జరిగింది. బాలింత మృతికి వైద్యుల అలసత్వం కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  నగరంలోని కోణనకుంట క్రాస్‌లోని అస్ట్రాం ఆస్పత్రిలో మంగళవారం మండ్యకు చెందిన తను (23) అనే గర్భిణి ప్రసవం కోసం చేరింది. వైద్యులు తనుకు సిజేరియన్‌ కాన్పు చేశారు. గంట తరువాత తను పరిస్థితి విషమించి కన్నుమూసింది. పుట్టిన గంటకే శిశువు అనాథ అయ్యింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)