రంజాన్‌ నెలలో ఖర్జూరం ఎందుకు తింటారు? ఏ దేశంలో ఉత్పత్తి అధికం?

Published on Wed, 03/13/2024 - 14:14

ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాన్ని ఇష్టంగా  తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. రంజాన్ మాసంలో ఖర్జూరానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉపవాసం ఉండేవారికి తగిన బలాన్ని అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉండేవారు ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించడానికి ఇదే ప్రధాన కారణం. 

అయితే మన తినే ఖర్జూరాలు ఏ దేశం నుండి వచ్చాయనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.  అలాగే ఏ దేశం అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తుందనేది కూడా చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం దేశాలు అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తాయి.  ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసే దేశం ఈజిప్ట్‌. ఈ దేశంలో ఏడాదికి దాదాపు 1,733,432 టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తారు.

ఖర్జూరం ఉత్పత్తిలో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 1,610,731 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఏడాదిలో 1,247,403 టన్నుల ఖర్జూరాలు పండే అల్జీరియా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. నాల్గవ స్థానంలో ఇరాన్  ఉండగా, ఇక్కడ ఒక సంవత్సరానికి 1,030,459 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 7,32,935 టన్నుల ఖర్జూరం పండుతుంది. ఈ దేశాల నుంచి విదేశాలకు ఖర్జూరాలు ఎగుమతి అవుతాయి. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)