Breaking News

మధురలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం

Published on Sat, 08/24/2024 - 09:13

సోమవారం (ఆగస్టు 26) శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని మధురలో గల శ్రీకృష్ణుని ఆలయం సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తుల కోసం 20 గంటల పాటు తెరిచివుంటుందని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ తెలిపింది.

మధుర శ్రీకృష్ణుని ఆలయంలో నేటి (శనివారం) నుంచి ఉత్సవాలు ప్రారంభమై గురువారం వరకు కొనసాగుతాయని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవాసమితి కార్యదర్శి కపిల్ శర్మ, సభ్యులు గోపేశ్వర్ చతుర్వేది తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని 20 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. సోమవారం స్వామివారి మంగళ హారతి కార్యక్రమంలో షెహనాయ్ వాదన ఉంటుందన్నారు. ఉదయం 5.30 నుండి దర్శనాలు మొదలువుతాయన్నారు. ఉదయం 11.00 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు.

జన్మాష్టమి నాడు సాయంత్రం వేళ శ్రీకృష్ణ లీలా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భరత్‌పూర్ గేట్ నుంచి ఊరేగింపు ప్రారంభమై హోలీగేట్, ఛట్టా బజార్, స్వామి ఘాట్, చౌక్ బజార్, మండి రాందాస్, డీగ్ గేట్ మీదుగా శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకుంటుందన్నారు. ఆలయంలో స్వామివారి అలంకరణ అద్భుతంగా ఉండబోతుందని అన్నారు. ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో జిల్లా యంత్రాంగం షూ షెడ్లు, లగేజీ షెడ్లు ఏర్పాటు చేసిందన్నారు. అలాగే వైద్య శిబిరాలు,  విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్నాయని తెలిపారు. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు