Breaking News

అరుణాచల్‌: కొట్టుకుపోయిన చైనా సరిహద్దు హైవే

Published on Thu, 04/25/2024 - 13:54

ఈటానగర్‌: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారీ కొండచరియాలు విరిగిపడ్డాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలతో దిబాంగ్‌ వ్యాలీ జిల్లాలోని జాతీయ రహదారి-33పై మున్లీ, అనిని ప్రాంతాల మధ్య భారీగా కొండచరియాలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో నేషనల్‌ హైవేపై కొంత భాగం కొట్టుకుపో​యి పెద్ద గుంత ఏర్పడింది. దీంతో చైనా బోర్డర్‌లోని దిబాంగ్‌ వ్యాలీ జిల్లాకు భారత్‌లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇక.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దిబాంగ్‌ వ్యాలీ వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

దీంతో వేంటనే రంగంలోకి దిగిన నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ సిబ్బంది హైవే మరమత్తులకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర సేవలు, వస్తువులకు ప్రస్తుతం ఎటువంటి అంతరాయం లేదని అధికారులు పేర్కొన్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్‌ అడ్వైజరీని విడుదల చేసింది. హైవే పునరుద్ధరణ పనుల కోసం మూడు రోజుల సమయం పడుతుందని పేర్కొంది. ఇక.. నేషనల్‌ హైవే-33 దిబాంగ్‌ వ్యాలీ జిల్లా ప్రజలకు, ఆర్మీకి చాలా కీలకం.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)