Breaking News

కోట్ల ఏళ్ల క్రితం ఆవాసయోగ్యమే!

Published on Thu, 02/27/2025 - 06:02

న్యూఢిల్లీ: ఎర్రని రంగుతో మెరిసిపోతూ అందంగా కనిపించే అంగారక(మార్స్‌) గ్రహంపై గతంలో జీవజాలం మనుగడకు అనుకూలమైన వాతావరణం ఉందన్న వాదనకు ఆధారాలు లభించాయి. అరుణ గ్రహానికి ఆ రంగు రావడానికి కారణం ఏమిటన్నది శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇనుముతో కూడిన ఖనిజం సమృద్ధిగా ఉండడం వల్లే అంగారకుడు ఎరుపు రంగు సంతరించుకున్నట్లు తేల్చారు. ఇలాంటి ఖనిజం ఏర్పడాలంటే చల్లటి నీరు అవసరం. అంటే మార్స్‌పై వాతావరణం కోట్లాది సంవత్సరాల క్రితం జీవులకు ఆవాసయోగ్యంగా ఉండి ఉండొచ్చని తెలుస్తోంది. 

మార్స్‌ ఉపరితలంపై ఎర్రటి దుమ్ము, రాళ్లు కనిపిస్తుంటాయి. ఐరన్‌ ఆక్సైడ్, ఫెర్రీహైడ్రైట్‌ వంటి ఖనిజాల అరుణగ్రహంపై ఉన్నట్లు ఇప్పటికే వెల్లడయ్యింది. ఈ ఖనిజాల కారణంగానే గ్రహం ఎరుపు రంగులోకి మారినట్లు అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ సైంటిస్టులు కనిపెట్టారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్‌ కమ్యూనికేషన్స్‌ పత్రికలో ప్రచురించారు. ఫెర్రీహైడ్రైట్‌ వల్ల మార్స్‌కు ఎరుపు రంగు వచ్చినట్లు చెప్పడం కొత్త విషయం కాకపోయినప్పటికీ దాన్ని తాము శాస్త్రీయంగా నిర్ధారించామని బ్రౌన్‌ యూనివర్సిటీ సైంటిస్టు ఆడమ్‌ వాలంటినాస్‌ స్పష్టంచేశారు. ఇందుకోసం మార్స్‌ ధూళిపై విస్తృతంగా పరిశోధనలు చేశామన్నారు.

 అరుణగ్రహంపై ధూళి, రాళ్లలో ఫెర్రీహైడ్రైట్‌ పుష్కలంగా ఉందని చెప్పారు. అతి తక్కువ ఉష్ణోగ్రతలు, చల్లటి నీటి సమక్షంలోనే ఈ ఖనిజం ఏర్పడుతుందన్నారు.  ద్రవరూపంలో నీరు ఉన్నట్లు తేలింది కాబట్టి అంగారకుడు ఒకప్పుడు ఆవాసయోగ్యంగా ఉండేదని కచ్చితంగా చెప్పొచ్చని వెల్లండిచారు. కోట్లాది సంవత్సరాల క్రితం బలమైన సౌర గాలులు వీచడం వల్ల మార్స్‌పై తడి వాతావరణం క్రమంగా పొడి వాతావరణంగా మారి పోయినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అక్కడ అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉంది. అందుకే సౌర గాలుల ప్రభావాన్ని తట్టుకోలేకపోయింది. అందుకే వాతావరణం పొడిగా, అతిశీతలంగా మారిపోయింది. 
 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)