Breaking News

కట్నం కోసం గెంటేశారు

Published on Mon, 09/01/2025 - 10:07

కర్ణాటక: కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడి ఇంటినుంచి గెంటేయడంతో భార్య నిరాహార దీక్షకు దిగింది. ఈఘటన  తుమకూరు నగరంలో జరిగింది. షష్టగిరి బ్లాక్‌కు చెందిన ప్రజ్వల్‌ శంకర్‌కు 2024లో తాలూకాలోని చిక్కనాయకనహళ్లికి చెందిన ప్రేరణతో వివాహమైంది. పెళ్లయిన నాలుగు రోజులనుంచే ప్రేరణకు వేధింపులు మొదలయ్యాయి.  

ఇన్నాళ్లూ ఓర్చుకున్న ఆమె దిక్కుతోచని స్థితిలో ధర్నాకు దిగి న్యాయం చేయాలని కోరుతోంది. బాధితురాలు మాట్లాడుతూ ప్రజ్వల్‌ తల్లిదండ్రులు ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా తన భర్త ఖాళీగా ఉంటున్నాడని తెలిపింది. వివాహమైన అనంతరం ఎనిమిది నెలలు మాత్రమే అత్తగారింట్లో ఉన్నానని, వేధింపులు తాళలేక గతంలో ఒక పర్యాయం ఇంటి ముందు ఆందోళనకు దిగానని, ఎవరూ పట్టించుకోలేదన్నారు. 

తాజాగా తనను బయటకు గెంటేయడంతో న్యాయం కోసం ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. తన వివాహం కోసం తన తండ్రి లక్ష రూపాయలు అప్పులు చేశాడన్నారు. తన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారం, వెండి తన అత్తవారి ఇంటిలో ఉన్నాయని, వాటిని ఇస్తే తన తండ్రి చేసిన అప్పులు తీర్చాలని ఉందన్నారు. భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయింది. తన గోడును మహిళా కమిషన్‌కు కూడా తెలిపానని పేర్కొంది.    

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)